గత కొన్ని రోజులుగా బెంగళూరులో నీటి సమస్య ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిపైన కేంద్ర ఆర్థిక మంత్రి ‘నిర్మలా సీతారామన్’ స్పందించారు. సిద్ధరామయ్య ప్రభుత్వంపై మండిపడ్డారు. గత ఏడాది కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అనేక నీటిపారుదల, నీటి సంబంధిత ప్రాజెక్టుల కార్యక్రమాలను నిలిపివేసినట్లు ఆరోపించారు. బెంగళూరు నగరం నీటి సమస్యలతో ఇబ్బంది పడటం చాలా బాధాకరం అని నిర్మలా సీతారామన్ అన్నారు. మే 2023లో విశ్వేశ్వరయ్య జల నిగమ్ లిమిటెడ్, కర్ణాటక నీరవారి నిగమ్ లిమిటెడ్, కావేరి నీరవారి నిగమ లిమిటెడ్, కృష్ణా భాగ్య జల నిగమ్ లిమిటెడ్ వంటి ప్రాజెక్టుల కోసం 20 వేల కోట్ల విలువైన టెండర్లను ముఖ్యమంత్రి నిలిపివేశారని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్ ను రాష్ట్రంలో ఎందుకు ప్రోత్సహించడం లేదని ఆమె ప్రశ్నించారు.
సిద్ధరామయ్య ప్రభుత్వంపై మండిపడ్డ సీతారామన్..
81
previous post