ఉత్తర కొరియా అధినేత హెచ్చరిక

Kim Jong Un

Advertisements

&NewLine;<p>ఉత్తరకొరియాను అణుదాడితో రెచ్చగొడితే తాము అణుబాంబు ప్రయోగానికి వెనకాడబోమని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తాజాగా హెచ్చరించారు&period; గురువారం మిసైల్ బ్యూరో ఆధ్వర్యంలో ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ క్షిపణి ప్రయోగం మాక్ డ్రిల్ నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిమ్&period;&period;డ్రిల్‌కు హాజరైన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు&period; ఈ సందర్భంగా ఆయన అణుదాడి హెచ్చరికలు చేసినట్టు ఉత్తరకొరియా వార్తా సంస్థ కేసీఎన్ఏ ఓ కథనాన్ని ప్రచురించింది&period; ప్రత్యర్థి అణుబాంబులతో రెచ్చగొడితే సంకోచించకుండా అణు బాంబు ప్రయోగించాలని మిసైల్ బ్యూరోకు కిమ్ సూచించినట్టు కేసీఎన్ఏ పేర్కొంది&period; చర్చల్లో బేషరతుగా పాల్గొనాలంటూ దక్షిణ కొరియా&comma; దాని మిత్రదేశాలు కిమ్‌ను కోరిన నేపథ్యంలో ఈ హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది&period; గతవారం వాషింగ్టన్ డీసీలో అమెరికా&comma; దక్షిణకొరియా మధ్య కీలక సమావేశం జరిగింది&period; ఉత్తరకొరియాతో యుద్ధం తలెత్తే పక్షంలో అణుబాంబు ప్రయోగ నివారణకు ఏం చేయాలనే దానిపై ఈ మీటింగ్‌లో చర్చ జరిగింది&period; కాగా&comma; ఉత్తరకొరియా తమపై అణ్వస్త్రాలు ప్రయోగిస్తే కిమ్ పాలన అంతమైపోతుందంటూ ఉభయ దేశాలూ సమావేశం అనంతరం ఘాటు వ్యాఖ్యలు చేశాయి&period; ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా శాంతి చర్చల్లో పాల్గొనాలని కిమ్‌కు స్పష్టం చేశాయి&period; ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా అధ్యక్షుడి హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..