మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ప్రగతి మైదానంలో సింగరేణి ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు సింగరేణి అధికారులు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీరాంపూర్ ఏరియా జిఎం సంజీవరెడ్డి హాజరై మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి సింగరేణి సాధించిన విజయాలు, సింగరేణి సంస్థలో విధులను నిర్వహించిన ఉత్తమ కార్మికులను గుర్తించి వారికి బహుమతి ప్రధానోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే గమ్యం ఒకే లక్ష్యం ఒకే కుటుంబం అనే స్ఫూర్తితో సింగరేణి అనేక విజయాలను సొంతం చేసుకుందన్నారు. సింగరేణి సంస్థ నష్టాలలో ఉన్న సంస్థ ఇప్పుడు లాభాల బాటలో పయనించడమే కాకుండా దేశానికి వెలుగులు అందించడంలో తెలంగాణ రాష్ట్ర సిరుల వేణి సింగరేణి ముందంజలో ఉందన్నారు. సింగరేణి కార్మికుల కృషితోనే ఈ అద్భుతాలను సుసాధ్యం చేయడం సాధ్యమైందన్నారు. సింగరేణి సంస్థ కేవలం బొగ్గును వెలికి తీయడమే కాకుండా సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లు, సోలార్ పవర్ ప్లాంట్ లు నిర్మించి ప్రొడక్షన్ లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో మన తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. అనంతరం ప్రగతి మైదానంలో నిర్వహించిన పాటల పోటీలతోపాటు నృత్యాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు తమ కుటుంబాలతో పాల్గొనగా, ఇతరులు కూడా ఈ కార్యక్రమాలను తిలకించడానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఒకే గమ్యం ఒకే లక్ష్యం ఒకే కుటుంబం…
71
previous post