67
చిల్లకూరు జాతీయ రహదారిపై స్కూటీలో వెళుతున్న చోటు(25) అనే యువకుడుని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన (చోటు) అనే యువకుడు గూడూరు పట్టణ సమీపంలో పంచర్ షాపు నిర్వహిస్తున్నట్లు సమాచారం. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.