అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో ఒక వింత ఆచారాన్ని కొన్ని సంవత్సరాలుగా ఆ గ్రామస్తులు పాటిస్తున్నారు. సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం నాడు సంజీవరాయ స్వామి పొంగళ్లను ఘనంగా మగవారు చేస్తారు. ఈ దేవాలయంలో స్వామివారికి పూజలు గాని ప్రసాదాలు గాని పొంగలి పెట్టడం గాని అన్ని మగవారి చేతి నుంచి జరుగుతాయి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆ గ్రామ ఆనవాయితీ. పూర్వం ఆ గ్రామంలో కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులకు ఆంజనేయ స్వామి రూపంలో ఒక సాధువు కనిపించి తన రూపం ఒక శిలా పథకం మీద బీజాక్షరాలతో రాసి ఉన్నాయి అది తెచ్చి మగవారు మాత్రమే ఈ గ్రామంలో పూజలు చేయండి మీరు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉంటారని తెలిపారు. ఆనాటి నుండి ఆ గ్రామ ప్రజలు అదే ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు. ఈ దేవాలయంలోకి వెలుపల నుంచే స్త్రీలు స్వామివారిని దర్శించుకోవడం చేయాలి. అలా చేయడం వల్ల ఆ గ్రామ ప్రజలు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉంటారని వారి నమ్మకం.
ఈ దేవాలయంలో మగవారికి మాత్రమే ప్రవేశం..
94
previous post