చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ అధికారుల ఓవర్ యాక్షన్..

Check post

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని శిఖరం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ అధికారులు ఏపీఎస్ఆర్టీసీ బస్సును నిలుపుదల చేశారు&period; గురువారం రోజు రాత్రి ఎనిమిది గంటల 35 నిమిషాల సమయంలో సుమారు 40 మంది ప్రయాణికులతో శ్రీశైలం నుంచి విజయవాడకు బయలుదేరిన విజయవాడ డిపోకు చెందిన AP 10 Z 0737 నెంబర్ గల సూపర్ లగ్జరీ బస్సు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు చెక్ పోస్ట్ సిబ్బంది నిలిపివేశారు&period; అకస్మాత్తుగా దట్టమైన అడవి ప్రాంతంలో గల శిఖరం చెక్పోస్ట్ వద్ద బస్సు నిలిపివేయడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు&period; దట్టమైన అడవి ప్రాంతం కావడంతో చలి గాలులతో భక్తులు&comma; చంటి పిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు&period; రాత్రి సమయంలో 9&colon;00 దాటితే శిఖరం చెక్పోస్ట్ నుంచి ఏ ఒక్క వాహనాన్ని కూడా అనుమతించరని అనుమతించాల్సి వస్తే స్థానిక శ్రీశైలం ఫారెస్ట్ రేంజ్ అధికారి వారి అనుమతి అవసరమని చెక్పోస్ట్ సిబ్బంది తెలిపారు&period; స్థానిక మీడియా ఘటన స్థలానికి చేరుకోవడంతో అప్పటివరకు బస్సును అనుమతించని ఫారెస్ట్ సిబ్బంది చివరకు బస్సు వెళ్లేందుకు 10&colon;10 నిముషాలకు శ్రీశైలం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనుమతి ఇచ్చినట్లుగా వెల్లడించి అక్కడ నుంచి బస్సు విజయవాడ వెళ్లేందుకు అనుమతించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.