77
గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఈ ఏడాది మొత్తం 132 మందికి ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించగా ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డులను నలుగురికి ప్రకటించారు. తెలంగాణకు చెందిన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, వేలు ఆనందాచారి, ఏపీ నుంచి ఉమామహేశ్వరి ఎంపికయ్యారు.