సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పారిశుద్ద్య కార్మికులు అనంతపురు జిల్లాలో సమ్మెకు దిగారు. గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నిరవధిక సమ్మె చేపట్టింది. సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని యూనియన్ అధ్యక్షుడు సూరి, కార్యదర్శి రామాంజనేయులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్మికులకు వర్తింపజేయాలని, కరోనా కష్టకాలంలో పని చేసిన కార్మికులకు పని భద్రత కల్పించాలన్నారు. అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. ట్రెజరీ ద్వారా వేతనాలు సక్రమంగా అమలు చేయాలన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కార్మిక నాయకలు హెచ్చరించారు.
సమస్యల పరిష్కారం పై పారిశుద్ధ్య కార్మికుల పోరాటం
62
previous post