పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి అభినందనలు తెలియజేసిన పవన్ కళ్యాణ్

Pavan kalyan

Advertisements

&NewLine;<p>పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికీ&comma; వెంకయ్య నాయుడు గారికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు&period; పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి అభినందనలు&comma; భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సాధించుకున్న అన్నయ్య చిరంజీవి గారిని &OpenCurlyQuote;పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది&period; నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను&comma; చిత్రాన్నీ మనసుపెట్టి చేశారు&period; కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు&period; అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు&period; సామాజిక సేవా రంగంలో అన్నయ్య చిరంజీవి గారు చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి&period; పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు&period; మాజీ ఉప రాష్ట్రపతి ఎం&period;వెంకయ్య నాయుడు గారు &OpenCurlyQuote;పద్మవిభూషణ్’ పురస్కారానికి ఎంపిక కావడం ముదావహం&period; విద్యార్థి నాయకుడు దశ నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడు గారు సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నారు&period; ఆయన వాగ్ధాటి&comma; తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైనవి&period; కేంద్ర మంత్రిగా విశేషమైన సేవలందించారు&period; రాజకీయ ప్రస్థానంతోపాటు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు&period; వెంకయ్య నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు &period; తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్&comma; తెలంగాణ నుంచి కళా&comma; సాహిత్య రంగాల నుంచి పలువురు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడం సంతోషకరం&period; వాదరికీ నా అభినందనలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్