తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సునామీ లాగా ఎగిసిపడి భారి స్థాయిలో సీట్లని కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు అన్నారు.. టిఆర్ఎస్ ప్రభుత్వంలో సాగించిన అవినీతి, ప్రజా వ్యతిరేక పాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని.. నిరుద్యోగులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూడలేక ఇంటికి పంపించడం జరిగిందని ఆయన అన్నారు. పినపాక నియోజకవర్గం లో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పైన పూర్తి వ్యతిరేకత ఏర్పడిందని, 34 వేల పైచిలుకు భారీ మెజారిటీ వెనకాల ప్రజలు, మిత్రపక్షాల సపోర్ట్ ఉందని.. ఈ విజయాన్ని అందించిన ప్రజలకు ఓటర్ మహాశయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా రంజక పాలన ఉంటుందని ఆయన అన్నారు.
పాయం వెంకటేశ్వర్లు హాట్ కామెంట్స్…
60
previous post