బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన పెద్దపల్లి ఎంపీ

MP Venkatesh

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేత&comma; పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత షాకిచ్చారు&period; ఈ ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు&period; అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు&period; కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఆయనతో భేటీ అయ్యారు&period; దీంతో పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్టైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు&period; బీఆర్ఎస్ లో ఈసారి సిట్టింగ్ లకు టికెట్ దక్కడం కష్టమేనని ప్రచారం జరగడంతో పాటు పార్టీ అధిష్ఠానం కొంతకాలంగా తనను దూరం పెట్టడంతో వెంకటేశ్ నేత పార్టీ మారినట్లు తెలుస్తోంది&period; జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్ నేత గతంలో ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో ఉన్నతస్థాయి ఉద్యోగం చేశారు&period; ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెంకటేశ్ తొలుత కాంగ్రెస్ లో చేరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేశారు&period; బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓటమి చవిచూశారు&period; ఆ మరుసటి ఏడాది అనూహ్యంగా బీఆర్ఎస్ లో చేరి పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు&period; ఎన్నికల్లో గెలిచి లోక్ సభలో అడుగుపెట్టారు&period; తాజాగా మరోసారి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..