54
సింగరాయకొండ లో రాష్ట్ర పురపాలక శాఖా మాత్యులు కొండపి నియోజకవర్గ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆది మూలపు సురేష్ వైస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన హామీ ప్రకారం అవ్వ, తాతలకు పెంషన్ పెంచుకుంటూ పోతున్నాడాని ఇప్పుడు 3000రూ ఇవ్వటం ఆనందంగా ఉందని అన్నారు. కొండపికి కొందరు నాలుగో కృష్ణుడు అని ఎద్దేవా చేస్తున్నారు అది కరక్ట్ కాదు మేము సేవకులం మాత్రమే అని అన్నారు. అందరూ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ని ఆదరించి వచ్చే ఎన్నికలలో తిరిగి మళ్లీ అధికారం ఇవ్వాలని అన్నారు.