ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు ఓటర్లు తరలివెళ్తున్నారు. హైదరాబాద్(Hyderabad) నుంచి సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో, హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే రోడ్లన్నీ ఫుల్‌గా కనిపిస్తున్నాయి. సోమవారం ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో, అక్కడ ఓటు హక్కు ఉన్న వాళ్లందరూ స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. ఇంకా వెళ్తూనే ఉన్నారు. ఓటు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఫలితంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే హైవేపై వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి.
పోలింగ్ తేదీకి ముందు వరుస సెలవులు రావడం కలిసొచ్చింది. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో ఓటు వేసేందుకు స్వస్థలాలకు వెళ్తున్నవాళ్లు.. కుటుంబసభ్యులతో సహా తరలివెళ్తున్నారు. శనివారం సెకండ్ సాటర్ డే, ఆదివారం, సోమవారం పోలింగ్ సెలవు వచ్చాయి. దీంతో, శుక్రవారం రాత్రి నుంచే రోడ్లమీద రద్దీ పెరిగింది.
కొందరు అభ్యర్థులు హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఏపీ ఓటర్లను రప్పించేందుకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. ఇక, సొంత వాహనాలు ఉన్నవాళ్లు.. తమ వాహనాల్లోనే కుటుంబసమేతంగా స్వస్థలాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా రోడ్లమీద వాహనాల రద్దీ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లడానికి అవకాశం ఉన్న అన్ని రోడ్లమీద ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా వాహనాలు హైవేలపై నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.
ఇక, హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య ఉన్న టోల్ ప్లాజాలు కిక్కిరిసిపోతున్నాయి. శుక్రవారం రాత్రినుంచే టోల్‌ప్లాజాలన్నీ రద్దీగా మారాయి. టోల్‌ప్లాజాలు దాటేందుకు చాలా సమయం పడుతోంది. ప్రధానంగా చౌటుప్పల్, పంతంగి, చిల్లకల్లు, కీసర టోల్‌ప్లాజాల దగ్గర వాహనాల రద్దీ పెరిగిపోయింది. దీంతో, వాహనాల రద్దీకి అనుగుణంగా ఆయా టోల్‌ప్లాజాల్లో కౌంటర్లను కూడా పెంచేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.