Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home National లోక్‌సభ ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్..!

లోక్‌సభ ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్..!

by Satya
The fourth phase of polling in the Lok Sabha elections

తెలుగు రాష్ట్రాల్లో మైకులు మూగబోయాయి.. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) భాగంగా నాలుగో దశ పోలింగ్ సోమవారం అంటే మే 13న జరగనుంది. నాలుగో దశలో 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ నేపధ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి నాలుగో విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత అభ్యర్థులు తమకు అనుకూలంగా ప్రచారం చేయలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు అభ్యర్థులందరూ ముమ్మరంగా ప్రచారం చేసేందుకు ప్రయత్నించనున్నారు.

నాలుగో దశలో మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 1717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాలుగో దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, జమ్మూ కశ్మీర్‌.. ఈ 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అత్యధికంగా తెలంగాణ నుంచి 525 మంది అభ్యర్థులు 17 ఎంపీ స్థానాల బరిలో నిలిచారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 25 స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక బీహార్‌లోని 5 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 55 మంది పోటీలో నిలిచారు. జమ్మూకాశ్మీర్లో ఒక్క పార్లమెంటు స్థానానికి 24 మంది పోటీపడుతున్నారు. ఝార్ఖండ్‌లోని 4 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 45 మంది పోటీలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని 8 పార్లమెంటు స్థానాలకు గానూ 74 మంది పోటీపడుతున్నారు. అటు మహారాష్ట్రలో 11 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుండగా 209 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒడిశాలో 4 పార్లమెంట్ స్థానాలకు 37 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 13 స్థానాలకు పోలింగ్ జరగనుండగా 130 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో 8 స్థానాల్లో 75 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

నాలుగో దశలో ఐదుగురు కేంద్ర మంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇద్దరు క్రికెటర్లు, ఒక నటుడు సహా 1717 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయిస్తారు. ఈ ఎన్నికలు ఫలితాలు జూన్‌ 4న రానున్నాయి. మొత్తం 96 స్థానాలకు 4264 నామినేషన్లు రాగా.. స్క్రుటినీ తర్వాత ఆ సంఖ్య 1970కు చేరుకుంది. ఇక ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం మొత్తం 1717 మంది మే 13న జరగనున్న పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ నేపధ్యంలో పోలింగ్‌కు 48 గంటల ముందునుంచే సైలెన్స్‌ పీరియడ్‌ అమలు అవుతుందని గుర్తు చేశారు.సైలెన్స్‌ పీరియడ్‌ కాలంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.
    ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మరియు వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. NSUI జాతీయ…
  • నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం సంచలన ప్రకటన.
    దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అంశం..పార్లమెంట్ లోపల, బయట తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన కొనసాగిస్తుండగా..పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్ష పార్టీల ఎంపీలు నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు పట్టుబడుతున్నారు.…
  • సోనమ్‌ వాంగ్‌చుక్‌కు తీవ్ర అస్వస్థత.
    ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. గత 24 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన ఢిల్లీ…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

042274
Total views : 223711

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: