తిరుపతి జిల్లా(Tirupati) దొరవారి సత్రం మండలం వడ్డికండ్రిగలో విషజ్వరాలతో గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. వారం రోజులు నుండి విష జ్వరాలతో బాధపడుతూ పరిస్థితి విషమించడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. రక్తకణాలు పూర్తిగా తగ్గిపోయి లివర్ చెడిపోవడంతో నెల్లూరు నారాయణ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అంకయ్య మరణించాడు.
ఇది చదవండి: సీట్ల సర్దుబాటుపై సీవీఆర్ న్యూస్ ప్రత్యేక కథనం…
అంకయ్యనే కాదు ఒక నెల నుండి గ్రామంలో ప్రతి ఇంట్లో విషజ్వరాలతో జనం అల్లాడిపోతున్నారు. హాస్పిటల్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రభుత్వ వైద్య సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. సచివాలయ సిబ్బంది కూడా ఎన్నికల డ్యూటీలో పడి గ్రామాలను గాలికి వదిలేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి