రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలపై నాదెండ్ల సమీక్ష..

Advertisements

<p>రాష్ట్రంలో పెట్రోల్&comma; డీజిల్ నిల్వలపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు&period; జాయింట్ కలెక్టర్లు&comma; ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో పరిస్థితిని సమీక్షించారు&period; రాష్ట్రంలో ఇంధనానికి ఎలాంటి కొరత లేదని&comma; ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు&period; సరఫరా వ్యవస్థలో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపాల వల్లే కొన్నిచోట్ల బంకులు మూతపడ్డాయని&comma; ఈ పరిస్థితిని త్వరలోనే చక్కదిద్దుతామని ఆయన పేర్కొన్నారు&period;<br &sol;>&NewLine;అక్రమ నిల్వలు&comma; బ్లాక్ మార్కెటింగ్‌పై మంత్రి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు&period; కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు&period; ఆయిల్ డిపోలు&comma; ప్రైవేట్ అవుట్‌లెట్‌లను నిరంతరం పర్యవేక్షించాలని&comma; క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్లకు సూచించారు&period; వాహనదారులలో భయాందోళనలు కలగకుండా ఎప్పటికప్పుడు సరైన సమాచారాన్ని మీడియా ద్వారా తెలియజేయాలని కోరారు&period;<&sol;p>&NewLine;<p>ముఖ్యంగా రద్దీ సమయాల్లో బంకుల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు&period; సరఫరా గొలుసు దెబ్బతినకుండా చూడటమే కాకుండా&comma; ప్రైవేట్ కంపెనీల డిపోలను కూడా తనిఖీ చేయాలని స్పష్టం చేశారు&period; ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..