నారా లోకేష్ (Nara Lokesh):
టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ను మరోసారి పోలీసులు తనిఖీ చేశారు. గుంటూరు జిల్లా(Guntur District) తాడేపల్లి సమీపంలోని ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ని ఆపిన పోలీసులు తనిఖీలు చేశారు. ఎన్నికల కోడ్ లో భాగంగానే సోదాలు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. దీంతో, పోలీసులకు లోకేష్ పూర్తిగా సహకరించారు. లోకేష్ కాన్వాయ్(Lokesh Convoy) లోని వాహనాలన్నింటినీ తనిఖీ చేసి కోడ్ కు విరుద్ధంగా ఏమీ తరలించడం లేదని నిర్ధారించారు. కోడ్ అమల్లోకి వచ్చాక ఇప్పటివరకు మూడుసార్లు లోకేష్ కాన్వాయ్ ని పోలీసులు(Police) తనిఖీ చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: డబుల్ ఇంజన్ సర్కార్ తో…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.