ఉమామహేశ్వరరావు హౌస్ అరెస్ట్

Umamaheswara Rao

Advertisements

&NewLine;<p>టీడీపీ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు&period; ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం లో వీటిపిఎస్ బూడిద అక్రమ రవాణాపై నిరసన తెలిపేందుకు వస్తున్నమాజీమంత్రి ఉమాను ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు&period; గొల్లపూడిలో ఉమ నివాసం వద్దకు భవానీపురం పోలీసులు తెల్లవారుజామునే చేరుకున్నారు&period; బూడిద చెరువు వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు&period; దీంతో పోలీసుల తీరుకు నిరసనగా దేవినేని ఉమ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు&period; ఈ సందర్భంగా దేవినేని మీడియాతో మాట్లాడారు&period; మంత్రి జోగిరమేష్&comma; ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ బూడిద అక్రమరవాణాతో రోజు కి కోటిరూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్నారని ఆరోపించారు&period; తాము ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ మండిపడ్డారు&period; అక్రమాలు మీకు&comma; అరెస్ట్ లు మాకా అంటూ అధికారపార్టీ నాయకులపై ధ్వజమెత్తారు&period; బూడిద పై అధికారులు తో మాట్లాడనివ్వండని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.