ప్రజా గళం లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు మాటలు వెనక్కి తీసుకోవాలి – వెంకటే గౌడ్ (Venkate Goud)
చిత్తూరు జిల్లా పలమనేరు లో ఎమ్మెల్యే వెంకటే గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే వెంకటే గౌడ్ (Venkate Goud) మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అశాశ్విత ముఖ్యమంత్రులు, మంత్రులే అని అన్నారు. నిన్న ప్రజా గళం లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు మాటలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలని పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ డిమాండ్ చేసారు. పలమనేరు శాసనసభ్యులు అయినా నన్ను పనికి మాలిన వాడ అని పలికావు. ఇసుక దొంగతనం చేసిన అని చెప్పావు 15%లు తీసుకుంటానని చెప్పావు మీకు రాజకీయ భయం చుట్టుకుంది అందుకే మీరు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు బిజెపితో పొత్తు పెట్టుకున్నారు.
నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలమనేరు కి ఏం చేశావ్…
మిస్పా మరణానికి మాకు ఎటువంటి సంబంధం లేదు మమ్మల్ని ఎందుకు ఇందులోకి లాగావ్ రాజకీయ పలోభాలు పలకడానికి మమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలమనేరు కి ఏమైనా చేశావు అని ఎక్కడ కూడా చెప్పలేదు. రోడ్డు వర్క్ చేసిందానికి బిల్లులు వస్తే ఆ బిల్లులు కూడా ఈకుండా తిప్పించుకుంటున్నావు అమర్నాథ్ రెడ్డి ఆ పాపం నీకు చుట్టుకుంటుంది. శ్రీనివాస కన్స్ట్రక్షన్ తో వారితో మాట్లాడితే నేను ఎమ్మెల్యే కాబట్టి గడపగడప కార్యక్రమానికి వెళ్ళినప్పుడు రోడ్లు లేదని నాకు చెబుతున్నారు.
చిన్నా చితక అప్పు చేసి రోడ్లు వేసాము…
దయచేసి మీరు రోడ్ల అన్న వేయండి లేదంటే క్యాన్సల్ చేసుకోమని శ్రీనివాస కన్స్ట్రక్షన్ వారితో మాట్లాడితే అన్నా మీరన్న వేసుకోండి వేరే వాళ్ళ దగ్గర అన్న వేపిచ్చండి సబ్ అగ్రిమెంట్ రాసి ఇచ్చినారు. రోడ్డు వేసిన తర్వాత ఫిబ్రవరి 27వ తేదీ నాడు4 కోట్ల 75 లక్షల రూపాయలు బిల్లు పడితే బిల్లు శాంక్షన్ అయితే ఎలక్షన్ అయ్యేంతవరకు డబ్బులు ఇవ్వొద్దు మేము అడుక్కున్నాము. చిన్నా చితక అప్పు చేసి రోడ్లు వేసాము మాకు బిల్లు శాంక్షన్ అయింది కదా డబ్బు ఇవ్వమని అడిగాం అధికారుల దగ్గర కూడా చెప్పి పంపించాము.
నువ్వు చంద్రబాబు నాయుడు పలికిన మాటలు ప్రజలు వినాలి..
అమర్నాథ్ రెడ్డి డ్రామా ఆడుతా ఉండవు 12.3.2024 తేదీ మూడు కోట్ల 75 లక్షల రూపాయలు నువ్వు పంపించలేదా, అమర్నాథ్ రెడ్డి ఇతరుల పేరు మీద టెండర్లు వేశాడు. 10% లు ఇస్తే గాని డబ్బు ఇవ్వనని నువ్వు చెప్పలేదా అమర్నాథ్ రెడ్డి నువ్వు 10% లు కమిషన్ తీసుకోలేదని శివాలయంలో ప్రమాణం వెయ్యి లేదంటే నేను వస్తాను. రేపు నేను కోరి వారి దగ్గర డబ్బు తీసుకోలేదని ప్రమాణం చేస్తా, ఎక్కడ తీసుకోలేదని ప్రమాణం చేస్తా ఈ రోజు సాయంత్రం వరకు నీకు టైం ఇస్తా ఉండా నీకు దమ్ముంటే రేపు 10 గంటలకు శివాలయం కొచ్చి నేనేం తప్పు చేయలేదని నువ్వు ప్రమాణం చేయి. అదే నేను రేపు శివాలయం కొస్తా నేను ఏమి తప్పు చేయలేదు అని ప్రమాణం చేస్తా, నువ్వు చంద్రబాబు నాయుడు పలికిన మాటలు ఈ ప్రజలు వినాలి శివాలయంలో కలుద్దాం అంటూ ఎమ్మెల్యే వెంకట్ గౌడ సవాలు విసిరారు.
ఇది చదవండి : ఏపీలో డ్రగ్స్ వెనుక పురందేశ్వరి కుటుంబ సభ్యులే – జగన్
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి