రాజోలులో వేడెక్కిన రాజకీయం, ఎమ్మెల్యే రాపాక వర్సెస్ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు. యువగళం పాదయాత్ర సందర్భంగా , నారా లోకేష్ రాజోలు ఎమ్మెల్యే రాపాకపై కీలక వ్యాఖ్యలు చేయడంతో మొదలైన వివాదం. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టడంతో నియోజకవర్గంలో ప్రస్తుతం ఈ ఇరువురి గొడవ హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మాట్లాడుతూ, గొల్లపల్లి అవినీతి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని, 20 ఎకరాలలో ఆదుర్రు గ్రామంలో అక్రమ సొమ్ముతో కాలేజీ నిర్మించారని ఆరోపణలు చేశారు, సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టించిన ఏకైక వ్యక్తి గొల్లపల్లి సూర్యరావు అని, గొల్లపల్లి అవినీతి తెలిసే చంద్రబాబు మంత్రిగా అవకాశం ఇవ్వలేదని రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు మాట్లాడుతూ, నారా లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, లోకేష్ ను విమర్శించే స్థాయి రాపాక లేదని గొల్లపల్లి అన్నారు. పవన్ కళ్యాణ్ సంస్కారం ఉన్న వ్యక్తి అని అందుకే పవన్ కళ్యాణ్ , రాజోలు నియోజకవర్గనికి వచ్చిన రాపాకపై మాట్లాడలేదని గొల్లపల్లి సూర్యరావు అన్నారు.
రాజోలులో వేడెక్కిన రాజకీయం….
78
previous post