71
నరేంద్రమోదీ ప్రభుత్వంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్లోకి ఇటీవల అగంతుకులు వచ్చి సభ్యులపై టియర్ గ్యాస్ వదిలిన ఘటనపై స్పందిస్తూ ఈ అంశం మన దేశ పార్లమెంటరీ వ్యవస్థకే మచ్చ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని విమర్శించారు. పార్లమెంట్ భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఓ బీజేపీ ఎంపీ సిఫార్సు వల్లే నిందితులకు పాస్లు వచ్చాయని, వారిని కాపాడేందుకే అధికార పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. ఈ ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని పొన్నం ప్రశ్నించారు. పార్లమెంట్ భద్రత అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.