గాంధీ భవన్..
మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) కామెంట్స్..
బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. విభజన హామీలు విస్మరించిన బీజేపీ కి వ్యతిరేకంగా ఈ నెల 14 న కరీంనగర్ లో దీక్ష చేస్తున్నాం. వచ్చే ఎన్నికలు బీజేపీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు. బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. తెలంగాణ విభజన చట్టంలోని అంశాలను హేళన చేసిన బీజేపీ ఏ నైతిక హక్కు తో ఓట్లు ఆడుతారు. తెలంగాణలో ఏడు మండలాలతో పాటు సీలేరు పవర్ ప్రాజెక్ట్ ను ఆంధ్ర లో కలిపిన ఘనత మీది. ఐదు గ్యారెంటీ గురించి విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు పదేళ్లలో మోడీ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి..? అధికారంలోకి వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలన్ని అమ్ముకున్నారు తప్ప చేసిందేమీ లేదు. రాముడు ఫోటోలు, అక్షింతలు పంపడం కాదు కాదు ప్రతి ఇంటికి ఏం ఇచ్చారు..? పదేళ్లలో ప్రగతి సాధించామని చెబుతున్న బీజేపీ చేతనైతే రాముడితో కాకుండా మోడీ(P.M Modi) బొమ్మతో ఓట్లు అడగాలి. రాముడు అందరివాడు, బీజేపీ నేతలది కాదు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
రాముడిని రాజకీయాల కోసం వాడుకోవడం దుర్మార్గం…
పదేళ్లు రాగద్వేషాలతో విచ్ఛిన్నం చేసే కుట్రలతో మోడీ పాలన కొనసాగింది. కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay)లు గెలిచిన పార్లమెంట్ నియోజక వర్గాల్లో చేసిందేంటో చెప్పాలి. ప్రకృతి వైపరీత్యం జరిగింది రైతులు నష్టపోయారు. కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడైనా రైతులకు 25 వేల నష్టపరిహారం ఇచ్చారా..? కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎంతమంది రైతులు చనిపోయారో లెక్కలు తీయండి. రైతుల కళ్ళల్లో నెత్తురు చూసి, రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న తతంగం అంతా ప్రజలు గమనిస్తున్నారు.
ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం- మంత్రి పొన్నం
ఓర్వలేని కొందరు కాంగ్రెస్ పార్టీపై కుట్ర చేస్తున్నారు. ఈ నెల 14 న కరీంనగర్ పార్టీ కార్యాలయంలో దీక్ష చేపట్టబోతున్నo. విభజన హామీలు విస్మరించిన బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దీక్ష చేపడతున్నాం. కేటీఆర్, హరీష్ రావు ఇంకా అధికారంలో అన్నట్టు భ్రమలో ఉన్నారు. నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు తీసిoది మోడీ ప్రభుత్వం ముందు. ముక్కుకు నెలకు రాసి బండి సంజయ్ రైతులకు క్షమాపణలు చెప్పాలి. గుర్తింపు కోసం బీజేపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఈ నెల 14 న కరీంనగర్ లో దీక్ష చేస్తున్నాం- పొన్నం ప్రభాకర్