విజయవాడ,
పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసిన పోతిన మహేష్. జనసేన పార్టీకి రాజీనామా చేశాను. పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం ప్రజలకు తెలిసింది. పవన్ కళ్యాణ్ ఎం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ పనిచేస్తున్నారు. పార్టీ నిర్మాణం, క్యాడర్ పై ఏనాడు ద్రుష్టి సారీంచలేదు.
పవన్ ది అంతా నటనే- పోతిన మహేష్ | Pothina Mahesh
పవన్(Pawan Kalyan) సిద్ధంతాలు అన్ని స్వార్ధ పూరితం. పవన్ గురించి తెలిసే ఆయన్ని ప్రజలు చిత్తు చిత్తు గా ఒడించారు. 25 రోజుల తరువాత పార్టీ పరిస్థితి ఏంటో చెప్పగలరా. 21 సీట్లతో పార్టీకి ప్రజలకు ఏం భవిష్యత్ ఇవ్వగలరు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాము. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. జనసేన పార్టీ ఇంకో ఇరవై ఏళ్ళు కొనసాగుతుందో లేదో తెలియదు. జనసేన పార్టీ లో పని చేసిన వారికి ఎందుకు సీట్లు కేటాయించలేదు. టీడీపీ వారికే ఎందుకు సీట్లు ఇచ్చారు. పార్టీ శ్రేణులకు సమాధానము చెప్పాలి. నా వద్ద ఆధారాలు ఉన్నాయి అన్ని బయట పెడతాం. కాపు సామజిక వర్గం ను బలి చేస్తున్నారు. కాపు యువతను మోసం చేయవద్దు. పవన్ తల్లిని దుషంచిన సుజనా చౌదరికి ఏవిధంగా సీట్ ఇచ్చారు. పచ్చ నోట్లు పడేస్తే అన్ని మర్చిపోతారా. ఈ అంశం పై సమాధానం చెప్పాలి.
Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రాజధాని ప్రాంత పరిధిలో జనసేన పార్టీ ని చంపేశారు. టీడీపీ, జనసేన కి 10 స్థానాలు కుక్క బిస్కెట్స్ పడేసిందా. బీజేపీ టీడీపీ ని సీట్లు సర్దుబాటు చేయమంది. జనసేన ఎందుకు సీట్లు ఇవ్వాలి. జనసేన పార్టీ పొత్తు కుదిరిచ్చితే సీట్లు ఎందుకు తగ్గించుకోవాలి. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పోటీ చేయడానికి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా? పార్టీ కి విధేయుడిగా ఉంటే నమ్మక ద్రోహం చేస్తారా? టీడీపీ, జనసేన పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయి.
రాబోయే రోజుల్లో జనసేన(Janasena) పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుంది- పోతిన మహేష్
పశ్చిమ నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గం లో పార్టీ సర్వే చేసి గెలిచే పశ్చిమ నియోజకవర్గం సీటును ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది. త్యాగాలకు బీసీ లు కావాలా. కమ్మ సామజిక వర్గం పనికి రాదా. పశ్చిమ నియోజకవర్గం సీటు ను పెతందారులకు కాకుండా వేరే వారికి ఇచ్చి ఉంటే సహకరించే వారము. రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పోగొట్టుకున్నాం. వీర మహిళల పదవి కాలం ఎందుకు పొడిగించారు. మిగతా వారి పదవులు ఎందుకు పొడిగించలేదు. పార్టీ కి విధేయుడిగా ఉంటే నమ్మక ద్రోహం చేస్తారా. టీడీపీ, జనసేన పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి