చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశం…

Prashant Kishore meeting with Chandrababu Naidu

Advertisements

&NewLine;<p>తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం ముగిసింది&period; ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం 3 గంటల పాటు సాగింది&period; జగన్ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో ప్రశాంత్ కిశోర్ ఓ నివేదికను చంద్రబాబుకు అందించారు&period; రాష్ట్ర యువతలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు&period; à°§à°°à°² పెంపు&comma; కరెంటు చార్జీల పెంపు&comma; పన్నులు&comma; నిరుద్యోగం తదితర అంశాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆ నివేదికలో పొందుపరిచారు&period; దళితులు&comma; బీసీలపై దాడులు వైసీపీకి ప్రతికూలంగా మారాయని… బీసీలు&comma; దళితులను వైసీపీకి దూరం చేశాయని కూడా ప్రస్తావించారు&period; ఎవరో ఒకరిద్దరు మంత్రులను మినహాయిస్తే&comma; మిగతా మంత్రులకు సున్నా మార్కులు పడతాయని నివేదికలో అభిప్రాయపడ్డారు&period; ప్రభుత్వానిది అహంకార ధోరణి అనే భావన ప్రజల్లో నెలకొందని కూడా వివరించారు&period; పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు విపక్షం తగిన వ్యూహ రచన చేసుకోవాలని&comma; యువతను ఆకర్షించేలా టీడీపీ కార్యాచరణ ఉండాలని నివేదికలో సూచించారు&period; ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సిఫారసు చేశారు&period; చంద్రబాబు అరెస్ట్ కారణంగా… తటస్థంగా ఉండేవారిలోనూ&comma; వైసీపీ వర్గాలోనూ జగన్ పై వ్యతిరేకత వచ్చిందని ప్రశాంత్ కిశోర్ నివేదికలో స్పష్టం చేశారు&period; కాగా&comma; ప్రశాంత్ కిశోర్ తన నివేదికలో ఆయా వర్గాలు&comma; అంశాల వారీగా ప్రభుత్వ బలాబలాలను కూడా విశ్లేషించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.