భారత్(India)లో తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైలు:
భారత్‌లో తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైలు(Metro Rail) పరుగులు పెట్టింది. పశ్చిమబెంగాల్(West Bengal) రాజధాని కోల్‌కతా(Kolkata) లో నిర్మించిన తొలి అండర్‌వాటర్ మెట్రో టన్నెల్(Underwater Metro Tunnel) మార్గాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అందులో ప్రయాణించారు. ఎస్ప్లనేడ్ నుంచి హావ్‌డా మైదాన్ స్టేషన్ వరకు ప్రధాని వెళ్లారు. ఈ సందర్భంగా మెట్రో సిబ్బందితో ప్రధాని ముచ్చటించారు. నదీగర్భ రైలు ప్రయాణ విశేషాలను సిబ్బంది వివరించారు. దీంతో పాటు పశ్చిమబెంగాల్(West Bengal)లో పలు మెట్రో ప్రాజెక్టులను మోదీ నేడు ప్రారంభించారు.
దేశంలో తొలిసారి 1984లోనే మెట్రో సేవలు..
దేశంలో తొలిసారి 1984లోనే మెట్రో సేవలు మొదలైంది కోల్‌కతా నగరంలోనే. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు(Metro Rail) పరుగులతోనూ మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. హావ్‌డా మైదాన్ నుంచి ఎస్‌ప్లెనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్ మెట్రో టన్నెల్(Underwater Metro Tunnel) నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని 45 సెకన్లలో దాటే మెట్రో రైలు(Metro Rail) కోల్‌కతా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని అధికారులు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: బెంగళూరులో బాంబు పేలుడు..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి