ప్రతీ తల్లీ, ప్రతీ కూతురు శక్తి స్వరూపమే..
దేశంలోని ప్రతీ తల్లీ, ప్రతీ కూతురూ శక్తి స్వరూపమేనని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పేర్కొన్నారు. భారత మాతతో పాటు ప్రతీ తల్లిని, ప్రతీ సోదరీమణిని శక్తి స్వరూపంగా పూజిస్తానని చెప్పారు. ఇలాంటి శక్తి స్వరూపాన్ని నాశనం చేస్తామంటూ కొందరు ఛాలెంజ్ చేస్తున్నారని రాహుల్ గాంధీ(Rahul Gandhi) పేరు ఎత్తకుండా విమర్శించారు. ఆ ఛాలెంజ్ ను తాను స్వీకరిస్తున్నానని, దేశంలోని శక్తి స్వరూపాన్ని తన ప్రాణమిచ్చిన కాపాడుకుంటానని మోదీ పేర్కొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జగిత్యాలలో జరుగుతున్న బీజేపీ విజయసంకల్ప వేదికపై మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రతీ మహిళా నాకు ఓ శక్తి స్వరూపమే. చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతానికి శివశక్తి అని నామకరణం చేశాం. అలాంటి శక్తిని వినాశనం చేస్తామని కొంతమంది బయలుదేరారు. ఇప్పుడు శక్తి వినాశకారులకు, శక్తిని పూజించే వారికి మధ్య పోరాటం మొదలైంది. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందనేది జూన్ 4న తెలుస్తుంది అని మోదీ ధీమా వ్యక్తం చేసారు.
ఇది చదవండి: ఎన్నికల కోడ్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి