అల్లూరి సీతారామ జిల్లా చింతపల్లి మండలం లంబసింగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో చాలీచాలని రూములతో ఇబ్బందులు పడుతున్న ఆశ్రమ పాఠశాల విద్యార్థినీలు. ప్రస్తుతం 320 మంది విద్యార్థినిలు ఇరుకైన చిన్న రూములలో చదువుకోవడం మరలా బెంచిలి తీసి పడుకోవడం కొంతమంది విద్యార్థినిలు రూములు చాలక బయట గ్రౌండ్లో నేలపై చదువుకోవడం జరుగుతుంది, గత తెలుగు దేశం ప్రభుత్వం హైములో స్కూల్ బిల్డింగ్ మంజూరు చేసారు అది పునాదిలు తీసి పిల్లరస్ కట్టి వదిలేసారు అక్కడ గోతుల్లో నీరునిల్వ ఉండి పోయి దోమలు విపరీతంగా పెరిగి పోయి రోగాలు బారిన పడి అవకాశం ఉందని ఆ గ్రామ పెద్దలు వద్యార్థి తల్లి తండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాడు నేడు పనులతో అన్ని స్కూళ్లను రూపుమారుస్తున్నారు కానీ లంబసింగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు ఆ భాగ్యం లేదని ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు తెలియపరిచిన వారి విద్యార్థినిలు సమస్య సమస్యలుగా మిగిలిపోయిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు కిముడి లక్ష్మయ్య అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థినిలు కనీస అవసరతలు తీర్చాలని విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థినీల సమస్యలు తీర్చేది ఎవరు?
98
previous post