76
నారాయణపేట జిల్లా మాగనూరు మండలం ముడుమల్ గ్రామంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కి నిరసన సెగ తగిలింది. రామ్మోహన్రెడ్డి ప్రచారాన్ని మహిళలు అడ్డుకున్నారు. తమ గ్రామం కృష్ణానదికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నా తాగునీటి సరఫరా లేదని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే చిట్టెం ప్రచారం అర్ధాతరంగా ముగించి వెళ్లిపోయారు.