Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Devotional శ్రీశైలం ఆలయంలో భారీ పాము పట్టివేత

శ్రీశైలం ఆలయంలో భారీ పాము పట్టివేత

by Prakash
srisailam snake

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోకి ఎనిమిది అడుగుల భారీ పాము రావడంతో కలకలం చెలరేగింది. పౌర్ణమి గడియలు సమీపిస్తున్న సమయంలో ఆలయ ప్రాంగణంలో పాము సంచరించడం జరిగింది. గర్భాలయం ఎదురుగా ఉన్న ఉమారామలింగేశ్వరస్వామి మండపంలో పాము కనపడటంతో భక్తులు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు.పామును చూసిన భక్తులు కేకలు వేయడంతో ఆల‌య అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అధికారులు అప్రమత్త‌మై స్నేక్ క్యాచర్ కు సమాచారం అందజేశారు. పాము ఉన్న ప్రదేశానికి వచ్చిన స్నేక్ క్యాచర్ రాజా చాకచక్యంగా పామును పట్టుకొని వెళ్ళాడు. కాగా గతంలో కూడా పౌర్ణమి రోజుల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో పాములు సంచరించడం జరుగుతుంద‌ని, అవి ఎవ్వరికి ఎటువంటి హాని చేయవని భక్తులు, స్థానికులు చర్చించుకున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039543
Total views : 198542

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: