111
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. పీవీ జ్ఞాన భూమి వద్ద పూలమాల వేసి సీఎం, మంత్రులు నివాళులు అర్పించారు. దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ అన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఆయన మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయంమన్నారు. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్ లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.