పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. ఇద్దరు జూనియర్ విద్యార్థులను నలుగురు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. కళాశాలలోని హాస్టల్లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఇద్దరు జూనియర్ విద్యార్థులను అడ్డుకొని జుట్టు ఎందుకు పెంచుతున్నారంటూ ప్రశ్నించారు. అనంతరం ట్రిమ్మర్‌తో ఇద్దరికీ గుండు చేసి, మీసాలు తొలగించారు. ఈ ఘటనపై విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ జూనియర్ విద్యార్థులు వైస్ ప్రిన్సిపల్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు కళాశాలలో విచారణ చేపట్టారు. సీనియర్లపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత విద్యార్థులు కాలేజీ ప్రిన్సిపల్ హిమబిందుకు ఫిర్యాదు చేశారు. కాగా ర్యాగింగ్‌కు పాల్పడిన నలుగురు విద్యార్థులపై జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేశారని ప్రిన్సిపల్ హిమబిందు తెలిపారు. ర్యాగింగ్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ర్యాగింగ్‌కు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. కాగా ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతుంది.
మరిన్నితాజావార్తలకోసంఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.