56
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా బీహార్‌లోని పూర్నియా జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతులతో సమావేశం అయ్యారు. రైతుల భూముల రక్షణ కోసం మాట్లాడే ప్రతి నాయకుడిపైనా మీడియా దాడి చేస్తుందని రాహల్ గాంధీ విమర్శించారు. భారత ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. రైతుల భూములను లాక్కొని అదానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు కానుకగా ఇచ్చారని ఆయన ఆరోపించారు. ప్రధాని మోడీ మూడు నల్ల చట్టాలు తెచ్చే ప్రయత్నం చేశారు. రైతుల పోరాటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు.