47
మిచాంగ్ తుఫాన్ ఉమ్మడి కృష్ణా జిల్లాలను అతలాకుతలం చేస్తుంది. గంట గంటకు పెరుగుతున్న భారీ వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తోంది. మరి కొద్ది సేపట్లో తీరం దాటే క్రమంలో మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం వైపు పర్యాటకలను అనుమతించకుండా పోలీసులు, మెరైన్ మరియు అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక గస్తీ కాస్తున్నారు.