Global Star Ram Charan :
నంద్యాల జనసేన కార్యాలయంలో గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ (Global Star Ram Charan) బర్త్ డే వేడుకలు రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా యువశక్తి అధ్యక్షులు పబ్బతి రవి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి శబరి, అసెంబ్లీ అభ్యర్థి ఫారూఖ్ బ్లడ్ బ్యాంకు ను ప్రారంభించారు. సుమారు వంద మంది జనసేన కార్యకర్తలు, అభిమానులు బ్లడ్ డొనేషన్ చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి శబరి మాట్లాడుతూ రామ్ చరణ్ నేను ఒకే స్కూలో చదువుకున్నామని, రామ్ చరణ్ తన పుట్టిన రోజు నాడు స్కూల్లో పని చేసే ఆయాలకు, డ్రైవర్లకు స్వీట్స్ పంచేవాడని తెలిపారు. వాళ్ళ కుంటుభంలో చిన్నప్పటి నుంచే సేవా గుణం అలవాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం జనసేన, రామ్ చరణ్ అభిమానులు కష్ట పడి పని చెయ్యాలని పిలుపు నిచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి