రామలింగేశ్వర స్వామి దేవాలయం

Ramalingeswara Swamy Temple

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా సత్యవోలు గ్రామంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైంది&period; 6 వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి&period; అపురూపమైన చాళుక్యుల వాస్తుశిల్పం రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిఫలిస్తుంది&period; ఇది ప్రాచీనతతోబాటు విశిష్టత చాటుకుంటూ ప్రసిద్ధ దేవాలయంగా నిలిచింది&period; ఈ గుడి గిద్దలూరు పట్టణానికి చాలా దగ్గర్లో ఉంది&period; గర్భగుడి గోడలకు ఉన్న గూళ్ళలో ఈశ్వరుని విగ్రహం&comma; లింగోద్భవ మూర్తి&comma; దుర్గాదేవి ప్రతిమలు ఉన్నాయి&period; గర్భగుడి మధ్యభాగంలో రామలింగేశ్వర రూపమైన శివలింగం ఉంది&period; శిఖరంపై కలశం కనువిందు చేస్తుంది&period; గుడి చాలా ఎత్తుగా ఉంటుంది&period; దేవాలయంలో పెద్ద మండపం&comma; గర్భగుడి&comma; అంతరాళం ఉన్నాయి&period; గుడికి దక్షిణాన నాలుగు చేతులున్న దేవతామూర్తి ఉంది&period; అంతరాళం శిఖరంపై రాతి కలశం ఉంది&period; ప్రాచీనతను చాటే మండపంలో నాలుగు స్తంభాలు ఉన్నాయి&period; వాటిపై అలరించే శిల్పాలున్నాయి&period; దేవాలయ మధ్యభాగంలో నటరాజ విగ్రహం ఉంది&period; సత్యవోలు రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఆరు దేవాలయాలు ఉన్నాయి&period; అన్ని గుడులూ శైవ ఆలయాలే కావడం విశేషం&period; ఈ దేవాలయాలు అన్నిటిలో పెద్దది భీమ లింగేశ్వరస్వామి ఆలయం&period; దీని ముఖద్వారం తూర్పుదిక్కుకు ఉంటుంది&period; మహా మండపానికి మూడు దిక్కులా అంటే తూర్పు&comma; పశ్చిమ&comma; దక్షిణ దిక్కుల గుండా భక్తులు వచ్చిపోయే సౌకర్యం ఉంది&period; రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని చుట్టుపక్కలవారే కాకుండా&comma; ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చి దర్శించుకుంటారు&period; మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో రామలింగేశ్వరస్వామి ఆలయం మరీ కిటకిటలాడుతుంది&period; సత్యవోలు రామలింగేశ్వర స్వామి దేవాలయ వాస్తు శిల్ప కళ మహానంది ఆలయాన్ని తలపిస్తుంది&period; మహానంది దేవాలయాన్ని కూడా చాళుక్యులే నిర్మించారు&period; శైవులైన చాళుక్యులు ఆంధ్రదేశంలో అనేక శివాలయాలను నిర్మించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత.