58
మిచాంగ్ తీవ్ర తుఫాన్‌తో ఉప్పెన ముప్పు పొంచి ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో తీరం వెంబడి 100 నుంచి 11 0కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి. తీరం దాటిన తర్వాత కూడా మిచాంగ్ ఉద్ధృతి కొనసాగుతుంది. దక్షిణ కోస్తాకు రెడ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. నెల్లూరులో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురుస్తుంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాగుంట లేఔట్ ప్రధాన రహదారి వెంబడి ఉన్న అపార్ట్ మెంట్లు , షాపింగ్ మాల్స్ నీటిలో మినిగిపోయాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. పెన్నా పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.