59
మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులిటెన్‌ను యశోద వైద్యులు విడుదల చేశారు. సీటీ స్కాన్‌లో ఎడమ తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఎడమ తుంటి మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారు. మధ్యాహ్నం తర్వాత కేసీఆర్‌కు మేజర్ సర్జరీ చేయనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. బాత్రూమ్‌లో జారిపడటం వల్ల సీఎం కేసీఆర్‌కు గాయమైనట్లు వైద్యులు తెలిపారు.
Read Also..
Read Also..