79
ఏపీలో ఓటర్ల తుది జాబితాను జనవరి 5న విడుదల చేయాలన్న నిర్ణయాన్ని మార్చుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే తాజాగా జనవరి 22న ఓటర్ల ప్రత్యేక జాబితా విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఏపీ సహా 12 రాష్ట్రాల్లోని ఓటర్ల ప్రత్యేక జాబితా విడుదల సన్నాహాలు చేయాలని ఆయా రాష్ట్రాల సీఈవోలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అభ్యంతరాల స్వీకరణ గడువును జనవరి 12 వరకు పొడిగించింది. ఈసీ తాజా నిర్ణయం నేపథ్యంలో, ఓటర్ల జాబితాల్లో సవరణలకు జనవరి 17 వరకు అవకాశం ఉంటుందని సమాచరం.