అన్ని వర్గాల వారి కోసం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆయన భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి తీరదన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని షర్మిల ఆవిష్కరించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు వందశాతం పెరిగిపోయాయని దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసినవారిని పక్కన పెట్టుకుంటున్నారని షర్మిల విమర్శించారు. అంబేడ్కర్ గురించి గొప్పగా చెప్పడం కాదు ఆయన ఆశయాలను అమలు చేయాలని హితవు పలికారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వబోమని ప్రజలు ప్రమాణం చేయాలని షర్మిల కోరారు. అక్రమంగా సంపాదించుకోవడానికి నా భర్తతో జగన్ వద్దకు వెళ్లానని అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ్టి వరకూ ఏదీ ఆశించి నా అన్న వద్దకు వెళ్లలేదని, దానికి సాక్ష్యం మా అమ్మేనని మీకు దమ్ముంటే మా అమ్మను అడగండి’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.
ఏపీ కాంగ్రెస్ ఆఫీస్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
79
previous post