ప్రతిపక్ష నేతలపై రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy

Advertisements

&NewLine;<p>గత పాలన గురించి ప్రతిపక్ష సభ్యులు పదే పదే మాట్లాడుతున్నారు&period; అప్పటి ప్రభుత్వంలో ఇప్పటి ప్రతిపక్షాలదే ప్రధాన భాగస్వామ్యం&period; ఆ పాపాలకు సంపూర్ణ బాధ్యత ప్రతిపక్షాలదే అంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు&period; మాట్లాడితే గత పాలనలో అలా జరిగింది ఇలా జరిగిందని విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు&period; మాజీ సీఎం కేసీఆర్ కు రాజకీయంగా అవకాశాలు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని&comma; పార్టీ యువజన సంఘం వైస్ ప్రెసిడెంట్ గా&comma; ఆ తర్వాత ఎంపీగా&comma; మంత్రిగా ఆయనను గౌరవించిందని గుర్తుచేశారు&period; హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలవకున్నా మంత్రిగా చేసి ఆపై ఎమ్మెల్యేగా గెలిచేందుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ అని వివరించారు&period; గత పాలనలో పాపాలు జరిగాయంటున్నారు&period; నిజంగానే పాపాలు జరిగి ఉంటే అప్పట్లో అధికారంలో భాగస్వాములుగా ఉన్నది మీరే కాబట్టి వాటికి సంపూర్ణ బాధ్యత కూడా మీదేనని కేటీఆర్ ఆరోపణలను రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు&period; తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లు పాలించిన ప్రభుత్వం ఏం చేసింది&period; ఆర్థిక విధ్వంసం ఎలా జరిగింది&comma; పదేళ్ల పాలనలో చేసిన వ్యవహారాలపై సంపూర్ణంగా చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు&period; మీకు మనసుంటే తెలంగాణ అభివృద్ధిని నిజంగా కోరుకుంటే మా పాలనకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ చదివిన గవర్నర్ ప్రసంగానికి అభినందలు తెలపాలని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.