సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఓడించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్ విజయభేరి యాత్ర – బీసీ డిక్లరేషన్ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ అందరికీ నా నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. రేవంత్ రెడ్డి రెండుచోట్ల ఘన విజయం సాధిస్తారన్నారు. కేసీఆర్ తన అవినీతి డబ్బుతో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్ను ఓడించాలని నిర్ణయించుకున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని ఆ పార్టీ నాలుగైదు సీట్లు గెలిస్తే ఎక్కువ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని, ఈ నెల 30వ తేదీన ఓటు వేసేందుకు ప్రజలు వేచి చూస్తున్నారన్నారు.
కేసీఆర్ పై రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో – సిద్ధరామయ్య
68
previous post