134
సీఎం రేవంత్రెడ్డి ట్వీట్ :
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నతో తనకు సన్నిహిత సంబంధం ఉండేదన్నారు. గతేడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం, ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరమన్నారు. వారి కుటుంబసభ్యులకు రేవంత్రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. లాస్య నందిత ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.