ఇరిగేషన్ అధికారులతో రివ్యూ సమావేశం….

Review meeting

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి &comma;ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ అధికారులతో రివ్యూ సమావేశం జరిగింది &period; ఈ సమావేశానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి&comma; డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క&comma; ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి&comma; కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి&comma; ఖమ్మం జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి&comma; తుమ్మల నాగేశ్వరరావు&comma; ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి&comma; జై వీర్ రెడ్డి&comma; ఉత్తమ్ పద్మావతి&comma; మందుల శామ్యూల్&comma; బీర్ల ఐలయ్య&comma; వేముల వీరేశం&comma; కుంభం అనిల్&comma; బాలు నాయక్&comma; తదితరులు పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ &&num;8221&semi; ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావాలంటే గత ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టుల పనులు ఆపకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు&period; ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న డిండి&comma; ఉదయ సముద్రం&comma; బ్రాహ్మణ వెళ్ళాంల&comma; ఎస్ యల్ బి సి టన్నెల్&comma; నక్కల గండి రిజర్వార్ల పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు&period; అలాగే పిలాయిపల్లి కెనాల్&comma; ధర్మ రెడ్డి కెనాల్ పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు&period; ఇరిగేషన్ ప్రాజెక్టు లను పూర్తి చేయడానికి తగినంత బడ్జెట్ ను కేటాయించాలని ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు సుఖేందర్ రెడ్డి సూచించారు&period; జిల్లా మంత్రులు ప్రాజెక్టులను సందర్శించి&comma; పనులు త్వరగా అయ్యేలా చూడాలని ఆయన కోరారు&period; ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు ఎంత వరకు పూర్తి అయ్యాయి&comma; ఇంకా ఎంత శాతం పనులు పెండింగ్ లో ఉన్నాయి&comma; ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం ఎంత నిధులను ఖర్చు చేసింది&comma; అలాగే ఇంకా ఎంత నిధులు అవసరం ఉన్నాయి అనే పూర్తి నివేదికను గుత్తా సుఖేందర్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క&comma; మంత్రులు&comma; ఇరిగేషన్ అధికారులకు అందించారు&period; ప్రాజెక్టులు పూర్తి అయితే జిల్లాలో నీటి సమస్య ఉండదని&comma; త్వరగా పనులు పూర్తి అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.