5 వికెట్ల తేడాతో టీమిండియా అద్భుత విజయం:
రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా(Team India) మరోసారి సొంతగడ్డపై అదరగొట్టింది. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ను మరో టెస్టు మిగిలుండగానే చేజిక్కించుకుంది. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో రోహిత్ సేన 5 వికెట్లతో అద్భుత విజయాన్ని అందుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓ దశలో టీమిండియా 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించినా శుభ్ మన్ గిల్, ధ్రువ్ జురెల్ జోడీ ఆరో వికెట్ కు అజేయంగా 72 పరుగులు జోడించి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు.
ఇది చదవండి: ఆఖరి మెట్టుపై బోల్తాపడిన టీమిండియా..
రాంచీ టెస్టులో విజయంతో టీమిండియా ఈ ఐదు టెస్టుల సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. సిరీస్ లో తొలి టెస్టు హైదరాబాద్ లో జరగ్గా… టీమిండియా అనూహ్యరీతిలో పరాజయం పాలైంది. అయితే, ఆ తర్వాత విశాఖ, రాజ్ కోట్, రాంచీల్లో జరిగిన మూడు టెస్టుల్లో వరుసగా నెగ్గి సిరీస్ విజేతగా నిలిచింది. ఇక, ఇరుజట్ల మధ్య నామమాత్రమైన చివరిదైన ఐదో టెస్టు మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.