జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో చొప్పదండి బీజేపీ అభ్యర్థి బొడిగా శోభ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ హాజరై మాట్లాడారు. తమ వర్గానికి చెంది బిడ్డను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పెన్షన్, ఆరోగ్య శ్రీ పథకం వంటి అనేక అంశాల పై పోరాటం చేసినట్లు తెలిపారు. 30 ఏళ్లుగా ఒకే జెండా కింద పని చేస్తూ పోరాడానని, వర్గీకరణ కోసం ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించు కోలేదని తెలిపారు. మాదిగ జాతి బిడ్డల భవిష్యత్ కోసం పోరాటం చేశానని, గత పాలకులు మనల్ని విస్మరించారని గుర్తుచేశారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ మన కోసం వచ్చి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని, ఇందుకోసం కమిటీ వేస్తున్నామని ప్రకటించారని పేర్కొన్నారు. మాట ఇచ్చి నిలబెట్టుకునే పార్టీ ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. ఉద్యమ సమయంలో అండగా నిలిచిన తనను కేసీఆర్ సీఎం అయ్యాక రెండుసార్లు జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మాదిగ బిడ్డ లేడన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటేయవద్దని అన్నివర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం మాదిగ యువత
ఉద్యమించారని, అటువంటి మన ఉద్యమాన్ని కేసీఆర్ అణచివేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల వద్దకు వెళ్లిన తనను వారు పట్టించుకోలేదని, బీజేపీ నాయకులు మన దగ్గరకు వచ్చి మాదిగలను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. శోభను భారీ మెజార్టీతో గెలిపించాలని, కమలం పువ్వుగుర్తుకు ఓటేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణ బీజేపీ తోనే సాధ్యం – మందకృష్ణ మాదిగ
71
previous post