కవిత పై రెచ్చిపోయిన సీతక్క…

sithakka

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మంత్రి ధనసరి సీతక్క ధ్వజమెత్తారు&period; రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కవిత అనవసరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు&period; మహిళలను కాంగ్రెస్ నుంచి దూరం చేయాలని కవిత ప్రయత్నిస్తున్నారని&comma; జీవో నెం 3కి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు&period; ఆ జీవో ఇచ్చింది కేసీఆరేనన్న విషయాన్ని కవిత గుర్తించాలని హితవు పలికారు&period; ఇకనైనా బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం ఆపి&comma; ప్రజల కోసం ఆలోచించాలని పిలుపునిచ్చారు&period; బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సీఎం అవ్వాలని కవిత భావించారని సీతక్క ఆరోపించారు&period; కానీ బీఆర్ఎస్ ఓడిపోవడంతో కవిత ఆశలు అడియాసలయ్యాయని ఎద్దేవా చేశారు&period; మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు&period; తమ ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తోందని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..