56
నారాయణపేట జిల్లా మక్తల్ లో గత 20 రోజులుగా వరుస దొంగతనాలు జరగడంపై మక్తల్ ప్రజలు భయాందోళన గురవుతున్నారు. రాత్రి అయితే చాలు ఎవరింట్లో దొంగతనం జరుగుతుందని ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మక్తల్ MLA వాకిటి శ్రీహరి, నిన్న మధ్యరాత్రి మక్తల్ పట్టణంలోని ప్రతి వీధిని పోలీసుల తో పాటు తిరిగి శాంతి భద్రతలు పర్యవేక్షించిచారు. మక్తల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానంగా ఎవరైనా కనిపిస్తే మాత్రం పోలీసులకు ఫోన్ చేయాలని ప్రజలకు ఆయన సూచించారు.