తెలంగాణ(Telangana)లోని సంగారెడ్డి(Sangareddy) జిల్లా హత్నూర్ మండలం చందాపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం(fire accident) జరిగింది. ఇక్కడి ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పరిశ్రమ డైరెక్టర్ రవితో పాటు మరో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ ఫైర్..!
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి