కరీంనగర్ జిల్లా(Karimnagar District)లో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. హుజూరాబాద్(Huzurabad) మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి వద్ద లారీలోని మట్టిపడటంతో ముగ్గురు మృతి చెందారు. బోర్నపల్లిలో జరిగిన పెద్దమ్మతల్లి బోనాల జాతరకు హాజరై తిరిగి బైక్ పై ఇంటికి వెళుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో వర్ష, విజయ్, సింధూజ చనిపోయారు. ఎలబోతారం నుంచి హుజూరాబాద్ వైపు హైవే మరమ్మతులకు తరలిస్తున్న మొరం మట్టితో కూడిన టిప్పర్ లారీ డ్రైవర్ అజాగ్రత్తతో వ్యవహరించి.. మలుపు వద్ద ఒక్కసారిగా బ్రేక్ వేయగానే.. లారీ బోల్తా పడింది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురిపై మొరం మట్టి పడటంలో దుర్మరణం పాలయ్యారు.
ఇది చదవండి: తెలంగాణలో ఏనుగు బీభత్సం..!
వెంటనే స్థానికులు హుటాహుటిన జేసీబీ సాయంతో మట్టిని తోడి వర్ష అనే యువతిని 108 అంబులెన్స్ లో హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఇక మట్టిలో కూరుకుపోయిన విజయ్, సింధూజాలను జేసీబీ సాయంతో మట్టిని తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. విజయ్, వర్ష ఇద్దరూ అన్నా చెల్లెలు కాగా, సిందూజ వరుసకు సోదరి అవుతుందని గ్రామస్తులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి