తాడపత్రి పట్టణంలోని రోటరీ క్లబ్ కార్యాలయంలో అనంతపురం మార్క్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ వారి సౌజన్యంతో తాడిపత్రి ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దాదాపు 120 మంది ఉచిత గుండె వైద్య శిబిరంలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి గుండెకు సంబంధించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గుండె పరీక్షలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని మందులతోనే సరి చేసుకోవచ్చని లేనిపక్షంలో గుండె ఆపరేషన్ వరకు పోవాల్సి వస్తుందని ప్రతి ఆరు నెలలకు ఒకసారి గుండె పరీక్షలు చేయించుకుని విలువైన మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ బడుగు బలహీన పేద వారు ఉన్నారని వారిని దృష్టిలో ఉంచుకొని ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. చికిత్సలో ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే మార్క్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు మాకు సపోర్ట్ చేస్తూ ఉచితంగా ఉండే ఆపరేషన్లు చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని తాడపత్రి నియోజకవర్గ ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు.
తాడిపత్రి పట్టణంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు…
106
previous post